కాంగ్రెస్ లోకి బిఆర్ఎస్ కెవి రాష్ట్ర కార్మిక నాయకుడు రవి సింగ్?

అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం 

త్వరలోనే కాంగ్రెస్ లో చేరుతారని విశ్వసనీయ సమాచారం

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) బిఆర్ఎస్ కెవి రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్ పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం, బిఆర్ఎస్ కెవి రాష్ట్ర కార్మిక నాయకునిగా ఉన్న రవి సింగ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుండి తన చూపు కాంగ్రెస్ వైపు మళ్ళింది కార్మికులకు అండగా ఉండాలంటే పార్టీ మారి కార్మికులకు మరిన్ని సేవలు చేయాలని ఆయన ఆశిస్తున్నట్టు సమాచారం త్వరలో బిఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతుంది. తన అనుచరులతో మాట్లాడి నిర్ణయం  తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరితే భవిష్యత్తులో కార్మికులకు ఎలాంటి కష్టం వచ్చినా వారి సమస్యను పరిష్కరించవచ్చని అభిప్రాయంలో ఉన్నటు అనుచరులు చెబుతున్నారు. భవిష్యత్తులో పార్టీని వీడతారో లేదో వేచి చూద్దామని కొంతమంది అనుచరులు తెలిపారు. మొత్తానికి రవి సింగ్ పార్టీ మారతారని జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.

.