అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందజేత

తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలో శుక్రవారం తెల్ల రవికుమార్ యువసేన ఆధ్వర్యంలో అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందజేశారు. మండల కేంద్రంలోని కోటగిందగల గాండ్ల వీరయ్య శుక్రవారం చనిపోవడంతో ఆయన అంత్యక్రియల హాజరై కుటుంబాన్ని పరామర్శించారు.  మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని కుటుంబాన్ని ఓదార్చారు.  మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. రాబోయే రోజుల్లో పేద కుటుంబాలకు అంత్యక్రియలకు ఇతర శుభకార్యాలకు అన్ని విధాల యువసేన తరపున సహాయ సహకారాలు అందిస్తామని సభ్యులు తెలిపారు. ముదిరాజ్ సంఘం పెద్దలు కప్ప రాజయ్య చేతుల మీదుగా ఈ ఆర్థిక సహాయాన్ని  గాండ్ల వీరయ్య కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో యువసేన నిర్వాహకులు తెల్ల రవికుమార్ ,కప్ప సంతోష్, పెద్ద కాపు శ్రీకాంత్, పప్పుల యోగేష్, తదితరులు పాల్గొన్నారు

.