తెలంగాణ ప్రభ (జగద్గిరిగుట్ట) కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో కొంతమంది కార్పొరేటర్లు కార్ దిగి కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతున్న తరుణంలో జగద్గిరిగుట్ట కార్పొరేటర్ జననేత జగన్ ఉద్యమ నాయకుడు ఎమ్మెల్సి శంభిపూర్ రాజు వెంటే తన రాజకీయ ప్రస్థానం కొనసాగానుందని ప్రకటించాడు.ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా శంబీపూర్ నాయకత్వంలో బీఆర్ఎస్ బలోపేతం దిశగా ముందుకు సాగుతామని అధికారం వున్నా లేకున్నా పార్టీ వీడే ప్రసక్తే లేదని పేర్కొన్నాడు.ఉద్యమాల గడ్డ జగద్గిరిగుట్ట లో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఉందని రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తామని తెలిపాడు. సోషల్ మీడియాలో వచ్చే కథనాలను కార్యకర్తలు నమ్మవద్దని రాజన్న వెంటే ఉండి కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామన్నాడు.సుధీర్గ కాలంగా ఎమ్మెల్సి శంబిపూర్ రాజు కు అనుంగ శిష్యుడుగా వున్న జగన్ ప్రకటనతో బీఆర్ఎస్ శ్రేణులకు భరోసా ఇవ్వనుంది.
