బిఆర్ఎస్ కెవి రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్
తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) నియోజకవర్గంలోని సూరారం మోడీ అపార్ట్మెంట్ బిల్డర్స్ భవన నిర్మాణ పనుల్లో గుర్రాల సత్యనారాయణ, అనే కార్మికుడు ప్రమాదవశాత్తు గత 19వ తారీకు శుక్రవారం రోజున, పైన అంతస్తు నుంచి కింద పడి అక్కడికక్కడే మరణించడం జరిగింది... భవన కార్మికుడు గుర్రాల సత్యనారాయణ భార్య లక్ష్మికి, ఇద్దరు పిల్లలు ఒక కుమారుడు, మరొకరు కుమార్తె ఉన్నారు... కార్మిక నాయకుడు రవిసింగ్ విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి హుటాహుటిన బయలుదేరి కార్మికుడు గుర్రాల సత్యనారాయణ కుటుంబానికి, మోడీ బిల్డర్స్ అపార్ట్మెంట్ యజమాన్యంతో బిఆర్ఎస్ కెవి రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్ పలుమార్లు చర్చించి చనిపోయిన సత్యనారాయణ కుటుంబ సభ్యులకు ఎనిమిది లక్షల రూపాయలు.. నష్టపరిహారం ఇప్పించి కుటుంబానికి బాసటగా నిలిచిన కార్మిక నాయకుడు రవిసింగ్ కి కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో అనిల్, శ్రీనివాస్ చారి,సుదర్శన్, జగన్, ప్రేమ్, తదితరులు పాల్గొన్నారు..
