దేశభక్తులను స్మరించుకుంటున్న చిన్నారులు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలోని ఓ కాలనీకి చెందిన చిన్నారులు బాల్యం నుండి దేశభక్తి అలవర్చుకొని స్వాతంత్ర సమరయోధులు గురించి పుస్తకాల్లో చదివి వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారికి నివాళులర్పించడం అందరిని ఆలోచింపజేస్తుంది. శనివారం స్వాతంత్ర్య సమర యోధులు భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ్ దేవ్ గార్ల వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. చిన్నారుల్లో ఇలాంటి దేశభక్తిని చూసి పట్టణ ప్రజలు వారిని అభినందించారు.

.