ఒకపక్క కరువు ఒకపక్క విధి ఆట.
మధ్యలో నగిలిపోతున్న రైతన్న.
తెలంగాణ ప్రభ ( ఇల్లంతకుంట): రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్పేట గ్రామానికి చెందిన తాడూరి పరుశురాం గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు ఈ క్రమంలోనే ఈ మధ్య రెండు ఎద్దులను కొనుగోలు చేశాడు. ప్రస్తుత పరిస్థితులలో సాగు నీటి కొరతతో వరి పొలం ఎండిపోగా అదే పొలంలో మేత కోసం తనకున్న రెండు ఎద్దులను కట్టివేసి మేపుతున్నడు. ఈ క్రమంలో తనకు అనుమానం వచ్చి తెలిసిన ప్రథమ చికిత్స చేసి రాత్రంతా అక్కడే ఉన్నాడు కానీ ఫలితం లేదు. ఆరుకాలం కష్టపడి పండించిన పంట సాగు నీరు లేక ఎండిపోతా ఉంటే విధి వక్రీకరించి ఇలా అకస్మాత్తుగా ఎద్దు చనిపోవడంతో కన్నీరు మున్నీరు అవుతున్న రైతు కుటుంబం తనకు జీవనాధారం అయిన ఎద్దును కోల్పోవడంతో కుటుంబాన్ని ఎలా పోషించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ప్రభుత్వం మానవత దృక్పథంతో ఆలోచించి తనకు ఆర్థిక సహాయం చేసి తన వ్యవసాయం కొనసాగేలా చూడాలని కోరుతున్నారు.
