తెలంగాణ ప్రభ ( మెదక్ ): చెరువులో పడి ఒకరు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా చిలప్ చెడ్ మండలం చండూర్ గ్రామంలో చోటుచేసుకుంది. చిలప్ చెడ్ ఎస్.ఐ షేక్ మహబూబ్ తెలిపిన వివరాల ప్రకారం... చిలప్ చెడ్ మండలం చండూర్ గ్రామనికి చెందిన రామరాయిని మహిపాల్ రెడ్డి(46) 19వ తేదీ పొలం పనికంటూ వెళ్లి చెరువుకుంట వద్ద కాలకృత్యాలు తీర్చుకోడానికి వెళ్లి ప్రమాదవశాత్తు మునిగిపోయినట్లు తెలిపారు. బుధవారం మృతదేహాన్ని గ్రామస్తులు బయటకు తీశారు. మృతుని భార్య స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ షేక్ మహబూబ్ తెలిపారు.
