తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) దుందిగల్ మున్సిపాలిటీ పరిధి డి.పోచంపల్లిలోని 8వ వార్డులో రూ.60 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సి.సి రోడ్డు నిర్మాణ పనులను వైస్ చైర్మన్ పద్మారావు కౌన్సిలర్ సాయి యాదవ్ తో కలిసి ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధికి ఎల్లవేలలా కృషి చేస్తామన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా పనిచేస్తామన్నారు. నిర్మిస్తున్న పనులలో నాణ్యత పాటించాలని కాంట్రాక్టర్ కి సూచించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మహేందర్ యాదవ్, పాక్స్ డైరెక్టర్ వెంకటేష్, మునిసిపల్ బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రెటరీ కోల్తుర్ మల్లేష్ ముదిరాజ్, కాలనీ ప్రెసిడెంట్ సర్వర్, నాయకులు వసిం, ప్రసాద్, మబ్బు, క్రిష్ణ, మధు, హీరా నాయక్, ఇమ్రాన్, ఖాన్ సాబ్ , ముస్తఫా, కిరణ్, తులసి రెడ్డి, ప్రవీణ, భీమయ్య, జహంగీర్, స్థానిక నాయకులు, కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
.