తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన నీలి గాయత్రీ ని రాష్ట్ర మహిళా మోర్చా అధికార ప్రతినిధి గా నియమిస్తూ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పా రెడ్డి నియామక పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నీలి గాయత్రి మాట్లాడుతు తన నియామకానికి సహకరించిన రాష్ర్ట మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారికి,ఎంపీ ధర్మపురి అరవింద్ కు జిల్లా అద్యక్షులు మోరపల్లి సత్య నారాయణ కు కార్యదర్శి పీసరీ నర్సయ్య, రాష్ర్ట నాయకులు ప్రభ రమణి గారికి, రుద్ర శ్రీనివాస్, డాక్టర్ రఘు, సుఖేందర్ గౌడ్ గారికి, జిల్లా మహిళా మోర్చా కార్యదర్శి పూర్ణిమ చౌదరి గారికి కృతజ్యతలు వ్యక్తం చేశారు
తన పై నమ్మకం తో భాద్యతలు అప్పగించిన బీజేపి పార్టీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీని , మహిళా మోర్చా ను బలోపేతం చేయడానికి కృషీ చేస్తానని,మహిళా సాధికారత దిశగా అడుగులు వేయడం ద్వారా మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే సంకల్పంతో పనిచేస్తాని,మోడి గారిపాలన లో మహిళలకు అనేక సంక్షేమ పథకాలు రుపొందించారని, వాటి సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా నా వంతు కర్తవ్యంగా నిర్వహిస్తానని నీలి గాయత్రి తెలిపారు
.