గృహ జ్యోతి పథకాన్ని ప్రారంభించిన ఎంపీటీసీ

తెలంగాణ ప్రభ, (తంగళ్ళపల్లి); కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకాన్ని ఆదివారం తంగళ్ళపల్లి మండలం చిన్నలింగాపూర్ గ్రామంలో ఎంపీటీసీ బైరినేని రాము మరియు కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గుర్రం రవీందర్ రెడ్డి, ఫ్యాక్స్ డైరెక్టర్ మంద నారాయణ గౌడ్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ రాము మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి గ్యారెంటీని కచ్చితంగా అమలు చేస్తుందని, ప్రజా పాలనలో ప్రజలందరికీ లాభం చేకూరుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో లైన్మెన్ రమేష్, బోలవేణి కనుకయ్య, మాసిని మాధవరెడ్డి మాసిని మాధవరెడ్డి, మంద చరణ్ తదితరులు పాల్గొన్నారు.

.