మీకు మద్దతుగా మీ ఎమ్మెల్యేగా పోరాడుతా
కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజయ్
ఎల్ఆర్ఎస్ ని రద్ధు చెయ్యాలి..
తెలంగాణ ప్రభ (కోరుట్ల): తెలంగాణ ద్రోహులు తెలంగాణాని పరిపాలిస్తు, ప్రజల సంక్షేమం ను పట్టించుకుంటా లేరని కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజయ్ అన్నారు. గత ప్రభుత్వంలో ఎల్ఆర్ఎస్ ని వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి వంద రోజులు అవుతున్నా, ఎల్ఆర్ఎస్ ని కోనసాగిస్తూ ప్రజలను మోసం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఎల్ఆర్ఎస్ రద్ధు చేయాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో బైటాయించి నిరసన తెలిపారు. అనంతరo కమీషనర్ కు వినతి పత్రం సమర్పించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వ్యవహార శైలికి నిరసనగా కోరుట్ల మరియు మెట్ పల్లి పట్టణాల్లో నిరసన కార్యక్రమాన్నీ చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం, తిరిగి ప్రజల వద్ద నుండి డబ్బులు దోచుకుంటుందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ఎల్ఆర్ఎస్ పై కట్టాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఎండకాలం వచ్చిన తాగునీటీ విషయములో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆయన విమర్శించారు. ప్రజలకు మద్దతుగా మీ ఎమ్మెల్యేగా పోరాడుతానని డా.సంజయ్ అన్నారు. ఈ కార్యక్రమములో భారాసా మండలాధ్యక్షులు దారిశెట్టి రాజేష్, చీటి వెంకట్రావు, అబ్ధుల్ ఫహీం, జిందం లక్ష్మీనారాయణ, చింతామణి ప్రభాకర్, అమీరుద్దీన్, కౌన్సిలర్ జిందం లక్ష్మీనారాయణ, గంధం గంగాధర్, నాయకులు పాల్గొన్నారు.
.