తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): గాజులరామారం డివిజన్ పరిధిలోని మహాదేవపురం, శ్రీరామ్ నగర్, చంద్రగిరినగర్ కాలనీల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శివాజీ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ పాల్గొని, ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా శ్రీశైలం మాట్లాడుతూ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం తపించే గొప్ప నాయకుడని అన్నారు. శివాజీ ఆలోచనలు, విధానాలు, పాలన వ్యవస్థ ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనల్లో, పాలనలో ప్రతిబింబిస్తాయని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 400 పైగా సీట్లు గెలుస్తుందని, మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి, పలువురు బీజేపీ నాయకులు, శివాజీ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు, బీజేపీ అనుబంధ సంఘాల సభ్యులు, హిందూ బంధువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
