తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య ఉప కేంద్రం పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలలో 9 నెలల నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ విటమిన్ ఏ చుక్కల మందు వేస్తున్నారు, పిల్లల కు రేచీకటి , కంట్లో తెల్ల మచ్చల నివారణ కు విటమిన్ ఎ చుక్కల మందు బాగా పనిచేస్తుంది ,
ఇప్పటి వరకు 52 మంది పిల్లలకు చుక్కల మందు వేయడం జరిగిందని ఎ ఎన్ ఎం భూలక్ష్మీ తెలిపారు, ఈనెల 19 వరకు చుక్కల మందు వేయనున్నట్లు ఆమే చెప్పారు , ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త సుంకరి బాలనర్సమ్మ , ఆశా వర్కర్లు స్రవంతి, లత పాల్గొన్నారు,
.