ఆరబెట్టినా ధాన్యం తీసుకురావాలి - మార్కెట్ కమిటీ అధ్యక్షుడు అయ్యోరి రాజేశ్

తెలంగాణ ప్రభ(ధర్మపురి): రైతులు ఆరబెట్టినా ధాన్యం కొనుగోలు కేంద్రం కు తీసుకు రావాలని ధర్మపురి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు అయ్యోరి రాజేశ్ తెలిపారు. శుక్రవారం వ్యవసాయ  మార్కెట్ యార్డులో డిసిఎంఎస్  ఆధ్వర్యంలో జరుగుతున్న  ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  పరిశీలించారు.  ఈ సందర్బముగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ యార్డునకు ఆరబెట్టిన  ధాన్యాన్ని తేమ 17%  మాత్రమే తేవాలని  మరియు పచ్చి వడ్లను మార్కెట్ యార్డులోనికి అనుమతించబడవని తెలిపారు. అకాల వర్షాల వల్ల రైతులకు తీవ్ర నష్టం జరగింది అని ఇట్టి విషయాన్నీ సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ దృష్టికి తీసుక వెళ్ళమని రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని తెలిపారు. ఈ  కార్యక్రమంలో జైన సహకార సంఘం చైర్మన్ సౌల్ల నరేష్,మరియు వ్యవసాయ ఏఈఓ నవ్య గ రైతులు తోట శ్రీనివాస్,అయ్యోరి మహేష్ ,ఎంకుస్ మహేష్, తదితరులు ,హమలిలు పాల్గొన్నారు.

.