తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో శ్రీ శివ మార్కండేయ జయంతిని పురస్కరించుకొని సోమవారం రోజున శ్రీ శివ మార్కండేయ జన్మదినం సందర్భంగా మన కోరుట్లలోని శివ మార్కండేయ కోటి నవదుర్గ దేవాలయం నుండి మార్కండేయుని శోభాయాత్ర సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాలకు బయలుదేరునని పద్మశాలి మహిళ సంఘ నాయకురాలు మచ్చ కవిత తెలిపారు.
ఇట్టి శోభయాత్ర మార్కండేయ గుడి నుండి మొదలుకొని ఐలాపూర్ దర్వాజ మీదుగా వెంకటేశ్వర స్వామి ఆలయ ముందు నుండి కాల్వ గడ్డమీదుగా గడిగురుజు నుండి కల్లూరు రోడ్డు మీదుగా మెయిన్ రోడ్ నుండి కార్గిల్ చౌక్ వరకు గాంధీ రోడ్ నుండి తిరిగి మార్కండేయ మందిరంలో ప్రవేశించునని ఆమె తెలిపారు
కావున ఇట్టి శోభాయాత్రలో మన పద్మశాలి కుల బాంధవులు వ్యాపారస్తులు తమ విధిగా భక్తితో బాధ్యతతో సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాలకు తమ వ్యాపార సంస్థలను మూసివేసి తమ భార్యా పిల్లలతో ఇట్టి శోభయాత్రలో పాల్గొని మంగళహారతులతో దేదీప్యమానంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఆమె కోరారు.
.