నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలి

ప్రభుత్వం మారినా విద్యార్థులపై ఆగని అరాచకాలు

ఏబీవీపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉదయ్ కిరణ్

తెలంగాణ ప్రభ ( మెదక్ ): అఖిల భారత విద్యార్థి పరిషత్ మెదక్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏ కార్యక్రమంలో ఏబీవీపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉదయ్ కిరణ్ పాల్గొని మాట్లాడారు. భువనగిరి జిల్లా కేంద్రంలో ఎస్సీ బాలికల సంక్షేమ వసతి గృహంలో పదో తరగతి చదివే విద్యార్థులు భవ్యశ్రీ, వైష్ణవి ఆత్మహత్యకు పాల్పడడం జరిగిందని, ఈ ఆత్మహత్య కేవలం పాఠశాల ప్రిన్సిపాల్, వార్డెన్ నిర్లక్ష్యం వల్లనే జరిగిందన్నారు. అంతేకాకుండా అర్ధరాత్రి వేళ కొందరు ఆటో డ్రైవర్లు హాస్టల్ లోకి చొరబడి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించేవారనే  ఆరోపణలు ఉన్నాయి. కేవలం వాళ్ళ తప్పును కప్పి ఉంచడం కోసం విద్యార్థుల ఆత్మహత్యకు మేం కారణం కాదంటూ మాట్లాడుతున్న యాజమాన్యంపై, విద్యార్థుల ఆత్మహత్యకు కారణమైన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  ఏబివిపి నాయకులు సత్య, కార్తికేయ తదితరులు పాల్గొన్నారు.

.