జేసీపీని అడ్డుకున్న పాసిగ్రామ ప్రజలు - పనులు జరిపేది లేదంటూ రెండు గంటల పాటు ఆందోళన

తెలంగాణ ప్రభ (వెల్గటూర్): వెల్గటూర్ మండలంలోని స్థంభంపల్లి గ్రామ శివారులో  ఇథనాల్ ప్యాక్టరి కి సంభంధించిన పనులను జరిపేందుకు కోసం నిర్వాహకులు  బుధవారం అక్కడికి లారిలో జెసీపీని పంపించగా , పాసిగామ ప్రజలు  అడ్డుకున్నారు.  ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఇథనాల్ ప్రాజెక్టు నిర్మాణం పనులు ఇక్కడ జరగనివ్వమని లారీ ముందు బైటాయించి రెండు గంటల పాటు ఆందోళన చేశారు. కొందరు వ్యక్తులు ఇథనాల్ ప్రాజెక్టు వద్దంటూ జెసీపీకి గుడ్డ కట్టుకొని ఆత్మహత్యాయత్నం చేయగా, పోలీసులు అడ్డుకున్నారు గిత్యాల జిల్లా, వెల్గటూర్ మండలంలోని స్థంభంపల్లి గ్రామ శివారులో సర్వే నెంబర్ 1090 లో  ఇథనాల్ ప్యాక్టరి నిర్మాణం జరిపేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసినదే. కాగా ఇక్కడ  ప్రాజెక్టు నిర్మాణం జరిగితే  ఇక్కడి ప్రాంతమంత కాలుష్యపు కోరల్లో చిక్కుకుంటుందని స్థంభంపల్లి, పసిగామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ప్రాజెక్టు నిర్మాణాన్ని జరగనివ్వమని తెగేసి చెప్తున్నారు. కాగా అక్కడి ప్రాంతాన్ని చదును చేసేందుకోసం  నిర్వాహకులు బుధవారం లారిలో జెసీపీని  పంపించారు. కాగా విషయం తెలుసుకున్న పాసిగామ ప్రజలు భారీగా తరలివచ్చి లారిని అడ్డుకున్నారు.  రెండు గంటల పాటు నిర్విరామంగా ఆందోళన చేపట్టారు. ఇప్పుడు వచ్చిన జీసీపీ తో  పాటుగా, ఇక్కడ ఉన్న మరొక రెండు జీసీపీలు కూడ తిరిగి పంపించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఈ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన  సీసీ కెమెరాల వలన మహిళ లు ఇబ్బంది పాడాల్సి వస్తుందని వాటిని తొలగించాలని కోరారు. రెండు గంటల పాటు సాగిన ఆందోళన కార్యక్రమం లో ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురైంది. కాగా వెల్గటూర్ ఎస్సై నరేష్  అక్కడకు చేరుకొని లారిలో వచ్చిన జీసీపీని తిరిగి వెనుకకు పంపించారు.  మిగిలిన జీసీపీ లను పంపించేందుకోసం  సంబంధిత అధికారులతో మాట్లాడు తానని నచ్చచెప్పి ఆందోళన విరమింప జేశారు

.