హోప్ ఫర్ ల్తెఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిట్టాపూర్ లో సానిటరీ నాప్కిన్స్ ,ప్యాడ్స్ పంపిణీ

తెలంగాణ ప్రభ (కోరుట్ల): హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలికా సురక్ష కిట్ల పంపిణీ మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ బాలిక వారోత్సవాల్లో భాగంగా బాలికలకు హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సానిటరీ నాప్కిన్స్ మరియు పాడ్స్ పంపిణీ చేశారు అనంతరం ఫౌండేషన్ వాలంటీరీ  శ్రావణి  మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి బాలికలు యువతులు మహిళలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని పీరియడ్స్ సమయంలో గుడ్డలకు బదులు నాప్కిన్స్ ఉపయోగించాలని దానిద్వారా గర్భాశయ సమస్యలు రాకుండా ఉంటాయని  ప్యాడ్స్ మాత్రమే వాడాలని నెలసరి సమస్యలపై జాగ్రత్త పాటించాలని సలహాలు సూచనలు అందజేశారు 

బాల్య వివాహాల వల్ల కలిగే ఇబ్బందులు యువతులు మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు దిశా నిర్భయ చట్టాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాయికుమార్ ఎంపీటీసీ మైస లక్ష్మి ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, సామాజిక కార్యకర్త విష్ణువర్ధన్ రాజ్, శ్యామల, అరుణ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు

.