ప్రవాసి దివస్, అబుధాబి లొ.

ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ యూఏఈ అధ్వర్యంలో ,ప్రవాసి దివస్* 

తెలంగాణ ప్రభ (కోరుట్ల): యూఏఈ,అబూధాబిలో, .ముస్ఎఫ్ఫా,బన్యస్, ఐకాడ్,.. లో వేడుకలు దుబాయ్ అధ్యక్షులు బత్తిని రాజా గౌడ్ మాట్లాడుతూ 

ప్రవాసీ దివస్, పురస్కరించుకొని, అబూధాబి లో కార్మికులను కలవడం జరిగిoది, కార్మికులు అనేక సమస్యలను రాజాగౌడ్ కు, తెలిపారు.

ప్రధానమైన ఈ క్రింది డిమాండ్లను ప్రవాసి దివస్ లో లేవనెత్తారు 

● ప్రవాసి భారతీయ బీమా యోజన అనే రూ.10 లక్షల విలువైన ప్రమాద బీమా పాలసీలో సహజ మరణం కూడా కవర్ అయ్యేలా ఇన్సూరెన్స్ లోని నిబంధనలు సవరించాలి.

● కరోనా మహమ్మారి వలన గల్ఫ్ దేశాలలో ఉద్యోగాలు కోల్పోయి వాపస్ వచ్చిన కార్మికుల జీతం బకాయిలు, ఉద్యోగ ముగింపు ప్రయోజనాలు పొందడానికి ప్రభుత్వం న్యాయ సహాయం అందించాలి.  

● ఖతార్‌లో అనేక మంది కార్మికులు ప్రాణాలను కోల్పోయారు,వలస కార్మికుల కుటుంబాలకు పరిహారం చెల్లించేలా ఫిఫా మరియు ఖతార్ పై భారత ప్రభుత్వం ముందుకు వచ్చి కర్మీక కుతుబలను ఆదుకోవాలి.

● ఎన్నారైలకు ఆన్ లైన్ ఓటింగ్ సౌకర్యం కల్పించాలి

● భారత ప్రభుత్వం దౌత్యపరంగా కృషి చేసి... సౌదీ అరేబియా, కువైట్  దేశాలను ఒప్పించి హైదరాబాద్ లో కాన్సులేట్ లు ఏర్పాటు చేయించాలని,,అలాగే మా గల్ఫ్ కార్మికుల పక్షాన 

ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ పోరాటం ఫలితంగా  హైదరాబాద్ లో యూఏఈ కాన్సులేట్   ఇటీవలే ఏర్పాటు చేసారు అని రాజా గౌడ్ అన్నారు .

మేము, కోరుకున్నట్లుగా ఈసారి బడ్జెట్ లో నిధులు కేటాయించి ఎన్ఆర్ఐ  తో కూడిన గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేసేలా కృషీ చెయ్యండి , గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన మాటను నెరవేర్చాలి,తెలంగాణ లొ కొత్త ప్రభుత్వo, తొందరగా  మా గల్ఫ్ హామీ నెరవేర్చాలి, తెలంగాణకు చెందిన 2014,కి పైగా కార్మికులు గల్ఫ్ దేశాలలో మృతి చెందారు.గల్ఫ్ దేశాలలో అమరులైన తెలంగాణ కార్మికులకు సంతాపం తెలుపుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించాలని..

గల్ఫ్ మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ బోర్డ్ తొ పాటు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి, గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ. 500 కోట్ల వార్షిక బడ్జెట్ కేటాయించాలి.

కనీసం ఈ ప్రభుత్వం మేల్కొనాలని ఆశిస్తున్నా..

అని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ యూఏఈ దుబాయ్ అధ్యక్షులు బత్తిని రాజా గౌడ్ అన్నారు.

.