అక్రమంగా రవాణా చేస్తున్న 230 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ పట్టివేత

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ):సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ ఆదేశాల మేరకు నమ్మదగిన సమాచారం మేరకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. గురువారం మామిడిపల్లి చౌరస్తా వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ వైపు నుండి జహీరాబాద్ వైపు వెళ్ళుతున్న లారీ నెంబర్  కెఎ 39 5563 ను తనిఖీ చేయగా అందులో 230 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ ను గుర్తించారు.  ప్రభుత్వంచే తెల్ల రేషన్ కార్డుదారులకు పంపిణీ చేయవలసిన పీడీఎస్ రైస్ కలిగి ఉండి అక్రమంగా రవాణా చేస్తున్న లారీ డ్రైవర్ సయ్యద్ ఆబేద్ షాను అదుపులోకి తీసుకొని, విచారించగా కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా బసవ కళ్యాణంకు చెందిన తన యజమాని జర్ణప్ప ఆదేశం మేరకు రవాణా చేస్తున్నట్లు వివరించాడు. అనంతరం లారీతో సహా డ్రైవర్ ను తదుపరి విచారణకై సంగారెడ్డి రూరల్ పోలీసు స్టేషన్ కు తరలించినట్లు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.

.