22న సత్సంగ సదనం లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు

అయోధ్యలో శ్రీరాంలాల విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా

తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సత్సంగ సదనంలో ఈ నెల 22న అయోధ్యలో శ్రీరామ్ లాల విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సత్సంగ సదనం  అధ్యక్షులు బ్రహ్మచారి లక్ష్మారెడ్డి తెలిపారు ,

జనవరి 22 ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు భజన కార్యక్రమాలు ,

ఉదయం 10 గంటలనుండి 11 గంటల వరకు శ్రీమాన్ నెమలికొండ రమణాచార్యుల చే శ్రీమద్రామయణ  ప్రవచనములుంటాయని అదేవిధంగా ఉదయం 11-00 గంటల నుండి మధ్యాహ్నం 1-00 గంట వరకు అయోధ్య శ్రీ రామ్ లాల విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని  ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులు వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు,

అనంతరం భక్తులు భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమాలను నిర్వహిస్తారని, అనంతరం భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం  ఉంటుందని ఆయన  తెలిపారు,

కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీరాముని కృపకు పాత్రులు కాగలరని ఆయన కోరారు,

.