కోరుట్ల మున్సిపల్ పరిధిలో ప్రజలు వ్యాపారస్తులు వివిధ పన్నులు సకాలంలో చెల్లించాలి

తెలంగాణ ప్రభ (కోరుట్ల): కోరుట్ల మున్సిపల్ పరిధిలో 2023-2024 ఆర్థిక సంవత్సరమునకు ప్రభుత్వం వారు ఇంటి పన్ను బకాయిపై అపరాద రుసుము ఎటువంటి మాఫీ ఇవ్వబడడం లేదని మున్సిపల్ కమిషనర్ టి రాజేశ్వర్ తెలిపారు కావున 2023- 24 ఆర్థిక సంవత్సరము తేదీ 31-3-2024 తో ముగుస్తున్నందున అట్టి సంవత్సరమునకు సంబంధించి మీ యొక్క ఇంటి పన్ను ( ఘర్ పట్టి ) నల్ల బిల్లులు మరియు అడ్వటైజ్మెంట్, ఎంక్రోజ్మెంట్, దుకాణాల లైసెన్స్ ఫీజులు మీ దగ్గరకు వచ్చిన సంబంధిత అధికారులకు సకాలంలో పన్నులు, ఫీజులు చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పడగలరని ఆయన కోరారు

లేనియెడల తెలంగాణ పురపాలక సంఘ చట్టం 2019 ప్రకారం మీ యొక్క ఆస్తులు జప్తు చేయబడును. 

అలాగే మీ ఇంటి పన్ను తీసుకొనుటకు మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ పెట్టబడినది. మరియు నూతన షాప్ లైసెన్స్, పాత షాప్ లైసెన్స్ రెన్యూవల్ కొరకు మీసేవ కేంద్రాలలో లేదా మీ దగ్గరకు వచ్చిన సంబంధిత అధికారులకు లైసెన్స్ ఫీజులు ఆన్ లైన్ ద్వారా  చెల్లించగలరు.

కావున పట్టణ ప్రజలు సకాలంలో పన్నులు, లైసెన్స్ ఫీజులు చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పడగలరని ఆయన సూచించారు

.