క్రీడాకారుల్లో ప్రతిభ వెలికితీసేందుకే హెచ్ పిఎల్

మాజీ కౌన్సిలర్ తిమ్మన్నగారి అనిల్ కుమార్

హెచ్ పి ఎల్ టోర్ని విజేత ఆస్ట్రెండ్ ఈగల్స్ జట్టు

రన్నరప్ గా క్రియేస్ హంటర్స్

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): హౌసింగ్ బోర్డులోని క్రీడాకారుల్లోని ప్రతిభ వెలికితీసెందుకే హౌసింగ్ బోర్డు ప్రీమియర్ లీగ్ (హెచ్ పి ఎల్ ) సీజన్ -3నిర్వహించినట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, హరిత మిత్ర అవార్డు గ్రహిత, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ తిమ్మన్నగారి అనిల్ కుమార్ అన్నారు. మంగళవారం బహుమతుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా  హాజరై ఆయన మాట్లాడారు.క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తి తో ఆడారన్నారు. అన్ని జట్లు ప్రతిభ కనబర్చినప్పటికి గెలిచేది మాత్రం ఒక్కరేనన్నారు. హౌసింగ్ బోర్డులో మూడు రోజులు పాటు జరిగిన క్రికెట్ పోటీలు కాలనీ వాసుల్లో, క్రీడాకారుల్లో ఎంతో ఉత్సాహం నింపాయన్నారు. హౌజింగ్ బోర్డు యువత క్రీడలతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారని అయన కొనియాడారు. ఒక వైపు వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ బిజీగా ఉంటూనే మరోవైపు పండగలు వచ్చినప్పుడు కాలనీ కి వచ్చి సందడి చేస్తారన్నారు.మెదక్ జిల్లా కే ఆదర్శం హౌసింగ్ బోర్డు యువత అని కొనియాడారు. మున్ముందు మరెన్నో క్రీడా పోటీలు నిర్వహించాలని తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు.

హోరా హోరిగా ఫైనల్ మ్యాచ్ 

హౌసింగ్ బోర్డు ప్రీమియర్ లీగ్  ఫైనల్ మ్యాచ్ క్రియేస్ హంటర్స్ -ఆస్ట్రెండ్ ఈగల్స్ మధ్య హోరా హోరిగా సాగింది. టాస్ గెలించి ముందుగా బ్యాటింగ్ ప్రారంభించిన క్రియేస్ హంటర్స్ నిర్ణిత 10 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 80 రన్స్ చేసింది.81 పరుగుల లక్ష్యం తో ఛేజింగ్ కు దిగిన ఆస్ట్రెండ్ ఈగల్స్ 9 ఓవర్ల లోనే 2వికెట్లు మాత్రమే కోల్పోయి 83పరుగులతో విజయం సాధించింది. విజయం సాధించిన ఆస్ట్రెండ్ ఈగల్స్ జట్టుకు ట్రోపి తో పాటు నగదు అధించిగా రన్నరప్ గా నిలిచినా క్రియేస్ హంటర్స్ కు ట్రోపి తోపాటు నగదు బహుమతి అందజేశారు. బెస్ట్ బ్యాట్స్ మెన్, బెస్ట్ బౌలర్, టోర్ని బెస్ట్ ప్లేయిర్ అవార్డులను సైతం తిమ్మన్నగారి అనిల్ కుమార్ అందజేశారు. ఈ సందర్బంగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను, టోర్ని నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులతో పాటు యువత, హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు

.