పతంగుల పోటీల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎంఆర్

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పటాన్చెరు డివిజన్ పరిధిలోని మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కైట్ ఫెస్టివల్ ను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గాలి పటాలు ఎగుర వేసి అందరిని ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్,  సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, ఎం డి ఆర్ యువసేన ప్రధాన సలహాదారు పృథ్వీరాజ్, అధ్యక్షుడు మధు, తదితరులు పాల్గొన్నారు.

.