క్రీడలతో స్నేహపూర్వక వాతావరణం

పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

రుద్రారం ప్రీమియర్ లీగ్ పోటీలు ప్రారంభం

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే క్రీడా పోటీల ద్వారా వాతావరణం వెల్లివిరిస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో ఏర్పాటు చేసిన రుద్రారం ప్రీమియర్ లీగ్ సీజన్ 4 క్రికెట్ పోటీలను శనివారం ఆయన లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించడంతో పాటు క్రీడాకారుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఎంపీటీసీలు మన్నే రాజు, హరి ప్రసాద్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.


.