ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

తెలంగాణప్రభ ,(తంగళ్ళపల్లి): బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తంగళ్ళపల్లి మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు,ప్రజాప్రతినిధులు పార్టీ జెండాను  ఆవిష్కరించారు. తంగళ్ళపల్లిలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బండి జగన్ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలకు స్వీట్లు పంచారు. అనంతరం మండలంలోని బీఆర్ఎస్ నాయకులతో కలిసి సెస్ చైర్మన్ చిక్కాల రామారావు,ఎంపీపీ పడిగెల మానస లు  సిరిసిల్ల లోని ప్లీనరీ సమావేశానికి బైక్ ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజన్న,సర్పంచ్ అనిత రవీందర్, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

.