తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ శివారులోని రావుస్ ఇంటర్నేషనల్ పాఠశాలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గురువారం పాఠశాలలో విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు నిఖిల్ రంగరాజు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలను, తెలుగు సంస్కృతిని ప్రతిబింబించడమే పండుగల ముఖ్య ఉద్దేశం అన్నారు. ఇటువంటి పండుగలను మరవకుండా, పండుగ వేడుకలను జరుపుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు. సంక్రాంతి పండుగ ముఖ్య ఉద్దేశం తెలియజేయడానికి ఈ ముగ్గుల పోటీ కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పోటీలలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నప్పటికీ శ్వేత, వీణ, సుమిత్ర విద్యార్థుల తల్లులు ప్రతిభ కనబరచడంతో బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ సుష్మ దుబే, చీఫ్ అడ్మిన్ శివ నారాయణ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నాగరాజు, ప్రీ ప్రైమరీ కోఆర్డినేటర్ గజ్జల శిరీష, ఇంగ్లీష్ టీచర్ మీనాక్షి, ఉపాధ్యాయ బృందం, పెద్ద సంఖ్యలులో విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
