అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించవద్దు

జీవో నెంబర్ 55 ను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి

ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రెటరీ శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మెదక్ శాఖ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్టేట్ జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ వ్యవసాయ ఉద్యాన యూనివర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించవద్దని డిమాండ్ చేశారు. అగ్రికల్చర్ యూనివర్సిటీలు అంటేనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి మేలు చేకూర్చి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా మార్చేలా రైతులకు నష్టాలు జరగకుండా రైతులు పండించే ప్రతి పంటకు లాభం వచ్చే విధంగా ఏర్పాటు చేయబడిందన్నారు. అగ్రికల్చర్ యూనివర్సిటీలో 35 సంవత్సరాలుగా మెడిసిన్ ప్లాంట్లు వెజిటేబుల్ సీడ్స్ మొదలగు వాటిపై ఎన్నో రకాల పరిశోధనలు జరిగి తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని పటిష్టం చేయడానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. కానీ ఆగ్రో బయోడైవర్సిటీ కొనసాగుతున్న పార్కులో రాష్ట్ర హైకోర్టుకు సంబంధించి భవనాలు కట్టడానికి జీవో నెంబర్ 55ని తీసుకొచ్చి యూనివర్సిటీలో దాదాపు 100 ఎకరాల భూమిని తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు.  హైకోర్టు భవనాన్ని ఈ ప్రాంగణంలో కట్టవద్దని ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు.  అదేవిధంగా గ్రామీణ విద్యార్థులకు విద్యను దూరం చేసి పరిశోధనలు జరగకుండా ప్రభుత్వం కుట్ర పూనుతుందని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి యూనివర్సిటీ భూములపై హైకోర్టు కేటాయించిన నిర్ణయం వెనక్కు తీసుకోవాలని, జీవో నెంబర్ 55 ని వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో  రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని  ఉదృతం చేస్తామని  హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉదయ్,  నాయకులు విజ్ఞాన్, కార్తికేయ, సత్య వర్షిత్ పాల్గొన్నారు

.