సదరం సర్టిఫికెట్ల నిజ నిర్ధారణ జరుగాలి

తెలంగాణ ప్రభ (కొడిమ్యాల ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ విధానంలో భాగమైన వికలాంగుల (అన్ని రకముల వైకల్యం)గల వారికి పింఛన్ ఇవ్వడానికి ధ్రువీకరణ పత్రంగా ఉపయోగ పడే సదరం సర్టిఫికెట్ నిజమైన లబ్ధిదారులకు కాకుండా కొందరూ అవినీతి అధికారుల బ్రోకర్ల చేతివాటం వల్ల పక్కదారి పట్టి నిజంగా వైకల్యం ఉన్న లబ్ది దారులకు కాకుండా ముడుపలు ఇచ్చినవారికి ఇచ్చారని    అపవాదు బలంగా వినిపిస్తుంది. దీనివల్ల నిజమైన వికలాంగులు లంచం ఇచ్చుకోని పేద వారు సదరం సర్టిఫికెట్ లేక పింఛన్ రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే జిల్లా కలెక్టర్ గారు మరియు సంబంధిత వైద్య శాఖ ఉన్నత అధికారులు వెంటనే వారి వద్ద ఉన్న సదరం లబ్ధిదారుల డాటా ఆధారంగా మండలం కేంద్రంలో పూర్తిస్తాయి పరిశీలన చేసి ఫేక్ సర్టిఫికెట్లను కాన్సల్ చేసి వారి పేర్లు పింఛన్ ల జాబితా నుండి తొలగించాలని కొడిమ్యాల మండల ప్రజలు కోరుతున్నారు. చూడాలి మరి అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారో లేక వాళ్ళ శాఖ డొల్లతనం బయటపడుతుందని గమ్మున ఉంటారో వేచి చూడాలి..

.