తెలంగాణ ప్రభ(ధర్మపురి): ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ని మెదక్ శాసనమండలి సభ్యులు శేరి సుభాష్ రెడ్డి సతీసమేతంగా దర్శించుకున్నారు.
ఎంఏల్సి దంపతులకు దేవస్థానం పక్షాన మేళతాళాలతో స్వాగతం పలికి పూజల అనంతరం అర్చకులు ఆశీర్వచనం ఇచ్చారు. దేవస్థానం రెనవేషన్ కమిటి చైర్మన్ ఇందారపు రామయ్య కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ శేష వస్త్రం ప్రసాదం చిత్రపటం ఇచ్చి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ ముత్యాల శర్మ, ముఖ్య అర్చకులు నంభి శ్రీనివాసాచార్యులు,సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్,రేనవేషన్ సభ్యులు అక్కనపల్లి సురేందర్, వేముల నరేష్, ఇనగంటి రమ వెంకటేశ్వరరావు, స్థంభంకాడి మహేష్,గునిశెట్టి రవీందర్ అర్చకులు నంభి నరసింహ మూర్తి పాల్గొన్నారు.
.