సంగారెడ్డి జిల్లాలో దారుణం : చర్చి కుప్పకూలి ఎనిమిది మందికి తీవ్ర గాయాలు

చర్చి కుప్పకూలి ఎనిమిది మందికి తీవ్ర గాయాలు

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ చర్చి కుప్పకూలింది. ఈ ఘటనలో ఎనిమిది మంది కార్మికులు గాయపడ్డారు. అందులో నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. భవన శిథిలాల కింద మరో నలుగురు కూలీలు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్య్కూ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల కింద చిక్కుకున్న నలుగురు కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు అంతా ఉత్తరప్రదేశ్‌కు చెందినవారుగా సమాచారం. అయితే చర్చి స్లాబ్ వేస్తుండగా సెంట్రింగ్ మెటిరియల్ కూలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

.