సంగారెడ్డిలో అనుమతిలేని క్లినిక్ లు, డయాగ్నస్టిక్ సెంటర్లు సీజ్

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): అనుమతులు లేకుండా నడుస్తున్న పలు ప్రైవేట్ ఆసుపత్రులను, డయాగ్నస్టిక్  సెంటర్లను జిల్లా వైద్య అధికారులు సీజ్ చేశారు. శుక్రవారం నాడు  సంగారెడ్డి జిల్లా కేంద్రంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జి.గాయత్రీదేవి ఆధ్వర్యంలో పలు ప్రైవేట్ ఆస్పత్రులను, డయాగ్నస్టిక్స్ సెంటర్ లను తనిఖీ చేసి సీజ్ చేశారు. పర్మిషన్ లేకుండా నడుస్తున్న మోతి మహల్ టాకీస్ రోడ్ లోని లిమ్రా క్లినిక్, ఎస్ ఎస్ డయాగ్నస్టిక్స్, ఎస్వీ డయాగ్నస్టిక్స్ సెంటర్లను  గుర్తించి వాటిని మూసివేశారు.  సంగారెడ్డి జిల్లాలో అనుమతులు లేకుండా ఎవరైనా క్లినిక్ గానీ, డయాగ్నస్టిక్స్ సెంటర్లు నడిపిస్తే  వారిపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

.