తెలంగాణ ప్రభ(ధర్మపురి): తెలంగాణ రాష్ట్రం లో ప్రభుత్వ బడులల్లో ఆధునిక సాంకేతిక, సౌకర్యాలు కల్పించి బోధన చేస్తున్నామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం ధర్మపురి మండలం లో ఆయన పర్యటించారు. మండలం లోని జైన గ్రామంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పూర్తి అయిన అభివృద్ధి పనులు ఆయన ప్రారంభించారు.
అదేవిధంగా మగ్గిడి ఎడపల్లి,జైన,రాజారాం గ్రామాల్లో జైన సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన గోదాం లను టెస్కబ్ చైర్మన్ కొండూరు రవీందర్ తో కలిసి ప్రారంభించారు.అంతకు ముందు దొంతపూర్ గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం ను మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యారంగంలో పెను మార్పులు వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో అనేక గురుకుల పాఠశాల లు ఏర్పాటు చేసి నాణ్యమైన భోజనం తో పాటు కార్పొరేట్ విద్యా ను అందిస్తున్నామని పేర్కొన్నారు. అన్ని వర్గాల పేద విద్యార్థుల కోసం బిసి,ఎస్సి,మైనార్టీల గురుకుల పాఠశాల లు అన్ని మండలాల్లో ప్రారంభించి ఉన్నతమైన విద్య దగ్గర చేసి బొదిస్తున్నామని అన్నారు. అన్ని గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాల లో మన ఊరు మన బడి కార్యక్రమంలో మరింత అభివృద్ధి చేస్తున్నమని తెలిపారు.అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ రాష్ట్రం సుఖ సంతోషాల తో జీవిస్తున్నారు. ప్రజలు అడగకుండానే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల అవసరాలను గుర్తించి సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారు అని తెలిపారు. రైతులకు, రైతుబందు,రైతు భీమా,మహిళా కోసం ఆరోగ్య లక్ష్మీ,షాది ముబారక్, కల్యాణ లక్ష్మీ, ఇంకా దివ్యంగులు,వృద్ధులకు, ఒంటరి మహిళా లకు పథకాలు అమలు చేసారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు అయ్యోరి రాజేశ్,జైన సహకార సంఘం అధ్యక్షుడు సౌల్ల నరేష్,రైతు బంధు అధ్యక్షుడు సౌల్ల బిమన్న,సర్పంచ్ లు కుడిక్యాల మహేష్,దుర్గం శ్రీనివాస్, కొండపల్లి రాంచందర్ రావు,ఎంపీటీసీ లు రైతులు, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
