అర్హులందరికీ ఆరు గ్యారెంటీలు... ప్రభుత్వ విప్ అడ్లూరి...

తెలంగాణ ప్రభ(ధర్మపురి): తెలంగాణ రాష్ట్రంలోని అర్హులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు పథకాలు అందుతాయని ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.శనివారం ధర్మపురి మండలంలోని రాజారం గ్రామంలో ప్రజా పాలన  కార్యక్రమంలో ఆయన పాల్గొని అర్హుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తామని ప్రతి ఒక్క అర్హునికి సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు.తెలంగాణ  రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన వెంటనే రెండు పథకాలు 48 గంటల్లోనే అమలు చేశారని మిగతా పథకాలను సైతం పూర్తి చేస్తామని తెలిపారు. ప్రజలు ఎవరు దరఖాస్తులను కొనుగోలు చేయవద్దని ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుందని ఎటువంటి అపోహలు నమ్మవద్దని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండారి లహరిక ఎంపిడిఓ ప్రవీణ్ తాసిల్దార్ కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.

.