గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
తెలంగాణ ప్రభ, (శేరిలింగంపల్లి ): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు అందేలా చూస్తానని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి లో గల గచ్చిబౌలి డివిజన్ వార్డ్ కార్యాలయం, ఖాజాగూడ జి.హెచ్.ఎం.సి ఇండోర్ స్టేడియం, నల్లగండ్ల మహిళ భవన్,రాయదుర్గం వార్డ్ కార్యాలయాల్లో లబ్దిదారుల నుండి దరఖాస్తులు తీసుకున్నారు.గౌలిదొడ్డి కేంద్రం లో శేరిలింగంపల్లి ఇంచార్జి విజయేందిర బోయి రహదారులు, మార్గాలు మరియు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి తో కలిసి కేంద్రాలను పరిశీలించి, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ గురువారం నుంచి జనవరి 6 2024 తేదీ వరకు ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీల పథకాలు అర్హులైన పేద ప్రజలకు అందించే విధంగా అధికారులు,ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలన్నారు.ప్రజల నుంచి మహాలక్ష్మి,అభయ హస్తం,రైతు భరోసా,ఇందిరమ్మ ఇండ్లు,గృహజ్యోతి,చేయూత పథకాలకు సంబంధించిన దరఖాస్తులను గచ్చిబౌలి డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని,రాజకీయాలకు అతీతంగా లబ్దిదారులను ఎంపిక చేస్తారు తెలిపారు.క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని,అర్హులైన లబ్ధిదారులందరు దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగ పరుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి,డీఈ విశాలాక్షి, సెక్షన్ ఆఫీసర్ రవీందర్ బాబు, ఏఈ మీనా,ఏఈ రమేష్, వర్క్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్,గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, సీనియర్ నాయకులు శ్రీ రాములు,కిషన్ సింగ్, వెంకటేష్, మన్నే సురేష్, శ్రీను, రాజు, యాదయ్య, చిన్న,మహిళ నాయకులు ,మహిళ కార్యకర్తలు,అనుబంధ సంఘాల ప్రతినిధులు,కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు,జిహెచ్ఎంసి అధికారులు,కాలనీ వాసులు స్థానిక నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
.