అయోధ్యలో రామజన్మభూమి అక్షింతల శోభాయాత్ర

తెలంగాణ ప్రభ(ధర్మపురి): శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వారి ఆధ్వర్యంలో  అయోధ్యలోనీ శ్రీ  రామజన్మభూమిలో అభిషేకం చేయబడిన అక్షింతల శోభాయాత్ర ధర్మపురి  పట్టణం లో సోమవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని హనుమాన్ దేవాలయం నుండి (హనుమాన్ వాడ) మొదలు కోని గాంధీ చౌక్, నంది చౌక్ మీదుగా శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయం ముందు నుండి గోదావరి వద్దగల శ్రీ రామాలయం వరకు శోభా యాత్ర నిర్వహించారు. దారిపొడవునా మహిళలు,భక్తులు స్వాగతం పలికారు. ఈ  శోభాయాత్ర కార్యక్రమంలో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు, పెద్ద మొత్తంలో మహిళలు మంగళ హారతులతో ,స్కూల్ పిల్లలు కోలాటంతో మరియు హిందూలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

.