తెలంగాణ ప్రభ( సిరిసిల్ల): పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది అందరూ ఈ నెల 29 వ తేదీ లోగా పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకునేలా చూడాలన్నారు.
ఆదివారం కలెక్టరేట్ లో పోస్టల్ బ్యాలెట్ , హోమ్ ఓటింగ్, ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ ఏర్పాట్లు,డిస్ట్రిబ్యూషన్ కు కావల్సిన బస్సులు, కౌంటింగ్ ఏర్పాట్ల పై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సమావేశం నిర్వహించారు.
జిల్లాలో ఇప్పటికే ఓటర్లందరికి ఓటరు సమాచారం స్లీప్ ల పంపిణీ పూర్తి చేశామని చెప్పారు.
హోమ్ ఓటింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.
సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో, వేములవాడ ప్రభుత్వ హై స్కూల్ లో
ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు.
అలాగే బద్దెనపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కౌంటింగ్ కు, రిసెప్షన్ పక్కగా ఏర్పాట్లు చేయాలన్నారు.
సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్, రిటర్నింగ్ అధికారులు ఆనంద్ కుమార్,మధుసూదన్ , స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి గంగయ్య, drdo శ్రీనివాస్, dwo లక్ష్మి రాజం, dpo రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
