కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ యూత్ నాయకులు

తెలంగాణ ప్రభ( సిరిసిల్ల):సిరిసిల్ల పట్టణానికి చెందిన బిఆర్ఎస్ యూత్ నాయకులు మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. బిఆర్ఎస్ యూత్ నాయకులు గడ్డం కిరణ్ ఆధ్వర్యంలో 30 మంది యువకులు కి సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి  కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని, బిఆర్ఎస్ పార్టీలో తమకు గుర్తింపు లేదని , కేవలం ధర్నా రాస్తారోకోలకు వాడుకున్నారని సభ్యులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఈసారి జెండా ఎగరవేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గోలి వెంకటరమణ, చొప్పదండి ప్రకాష్, వైద్య శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

.