భాజపాలో భారీగా యువకుల చేరిక

తెలంగాణ ప్రభ, (ఎల్లారెడ్డిపేట): ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి బిఆర్ ఎస్ పార్టీకి చెందిన   సీనియర్ యువ నాయకుడు పందిర్ల మదు గౌడ్ ఆధ్వర్యంలో భారీగా యువకులు భాజపాలో శనివారం చేరారు.  జాతీయ వాదానికి సేవ చేయడానికై ప్రధాని నరేంద్ర మోడీ  ఆశయాలకు అనుగుణంగా జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్  అడుగులో అడుగై పని చేయడానికి పార్టీలో చేరినట్లు వారు వెల్లడించారు. సిరిసిల్ల భాజపా శాసనసభ అభ్యర్థి రాణి రుద్రమ  అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ లో చేరారు.బాజపా  విజయానికి తన వంతు కృషి చేస్తానని మధు గౌడ్ పేర్కొన్నారు. త్వరలో 200 మంది యువకులను తన తో పాటు పార్టీ లోకి తీసుకొస్తామని వారు వెల్లడించారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు శ్యాగ లక్ష్మణ్,గణేష్ తదితరులు పాల్గొన్నారు.

.