కొప్పుల ఈశ్వర్ గీతం ఆవిష్కరణ


తెలంగాణ ప్రభ(ధర్మపురి): తెలంగాణ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదినాన్ని పురస్కరించుకుని  యస్వీ మల్లిక్ తేజ  రచనా గానంలో మామిడిమౌనిక పర్యవేక్షణలో జైన సహకార సంఘం చైర్మన్ సౌళ్ల నరేష్ నిర్మాణ సారథ్యంలో రూపొందించిన జననేత కొప్పుల ఈశ్వరన్న అనే ప్రత్యేక గీతాన్ని జగిత్యాల జిల్లా బీఆర్ఎస్  పార్టీ అధ్యక్షులు, కోరుట్ల శాసన సభ్యులు  కల్వకుంట్ల విద్యాసాగర్ రావు బుధవారం రోజున తన నివాసంలో ఆవిష్కరించారు.

ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ నిత్యం ప్రజల సేవకే అంకితమైన మంచి మనసున్న నిస్వార్థ నాయకుడు ఈశ్వరన్న మీద పాట రూపొందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా  కవి గాయకులను, నిర్మాతను అభినందించారు.

ఈ కార్యక్రమంలో  పలువురు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

.