మెదక్ రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని పరిశీలించిన వ్యయ పరిశీలకుడు సంజయ్ కుమార్

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో):  మెదక్ నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి  కార్యాలయాన్ని వ్యయ పరిశీలకుడు సంజయ్ కుమార్ IRS ఆదివారం పరిశీలించారు. అభ్యర్థి వ్యయ వివరాలు నమోదు చేయాలని, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చుల వివరాలు నామినేషన్ వేసినప్పటి నుంచి అభ్యర్థి ఖర్చులను లెక్కలోకి తీసుకోవాలని, ప్రతి అభ్యర్ధి  బ్యాంక్ కొత్త అకౌంట్ ఖాతా తెరవాలని తెలిపారు.

కార్యక్రమంలో ఉన్న AEO అకౌంటింగ్ టీమ్ లకు తగు సూచనలు సలహాలు అందించారు.

అభ్యర్థుల ఖర్చులపై నిఘా పెంచాలని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఉన్న వసతులు, సదుపాయాలను,

కార్యాలయంలో ఏర్పాటు చేసిన  టివి మానిటరింగ్ విధానాన్ని పరిశీలించారు.

అధికారులకు తగు సూచనలు సలహాలను అందించారు. 

ఈ కార్యక్రమంలో  లైజన్ అధికారి, జిల్లా పరిశ్రమల శాఖ  జి.ఏం కృష్ణమూర్తి, రిటర్నింగ్ అధికారి/ఆర్డిఓ  అంబదాస్ రాజేశ్వర్, అకౌంటింగ్ టీం, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

.