తెలంగాణ ప్రభ (ఇల్లంతకుంట): మండలంలోని రహీంఖాన్ పేట ఆదర్శ పాఠశాల లో హిందీ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న బిగుల్ల బాబు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి 2018-23 సంవత్సరంలో డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ సీనియర్ ప్రొఫెసర్ షకీలా ఖానం గారి మార్గదర్శకత్వంలో
" 21వ శతాబ్దపు హిందీ నవలలో దళిత చైతన్యం"
అనే అంశంలో నాలుగు సంవత్సరాలు పరిశోధన చేసి సమర్పించినారు.
ఇట్టి గ్రంథమును యూనివర్సిటీ ప్రొఫెసర్లు పరిశీలించి.
18 .10. 2023 నాడు బాబుకు డాక్టరేట్ ప్రధానం చేస్తున్నట్టు యూనివర్సిటీ వారు ప్రకటించారు.
అతి చిన్న (30 ) వయసులోనే డాక్టర్రేట్ పొందడం పట్ల పాఠశాల ఉపాధ్యాయ బృందం ప్రధానోపాధ్యాయులు బాబును ఘనంగా సత్కరించారు,
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుకర్,ఉపాధ్యాయులు వెంకన్న ,అంజన్న ,స్వామి ,నరేష్ మహేందర్, వేణు తదితరులు పాల్గొన్నారు.
