
తెలంగాణ ప్రభ(ధర్మపురి) : వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించాలి అని మార్కెట్ కమిటీ అధ్యక్షుడు అయ్యోరి రాజేశ్,తెలిపారు.బుధవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం జైనా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎంపీపీ చిట్టిబాబు తో కలిసి ప్రారంభించారు. జైనా గ్రామములో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను జైన సహకార సంఘం అధ్యక్షుడు సౌల్ల నరేష్ ప్రారంభించగా
ధమ్మన్నపేట్ గ్రామంలో మార్కెట్ కమిటీ అధ్యక్షుడు అయ్యోరి రాజేష్, ఎంపీపీ చిట్టిబాబు గారు వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించారు.
రాజరం గ్రామంలో ధర్మపురి మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సౌళ్ల బీమాయ్య ప్రారంభించారు.
వరి ధాన్యం కు
గ్రేడు ఏ కు రూ 2060లు.
సాధారణం రకం కు రూ2040/- రూపాయల మద్దతు ధర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సహకార సంఘం ఉపాధ్యక్షులు మూల మోహన్ రెడ్డి ,పాలకవర్గ సభ్యులు కుక్కలు చిన్న గంగా రెడ్డి, సౌడం రాజయ్య, దండవేణి గంగమల్లయ్య ,తాడుక తిరుపతి ధమ్మన్నపేట్ సర్పంచ్ పులిశెట్టి మల్లేశం,ధమ్మన్నపేట్ ఎంపీటీసీ తోడేటి గంగాధర్ ధమ్మన్నపేట్ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గొల్లపెళ్లి సత్తయ్య అన్ని గ్రామాల వార్డు సభ్యులు నాయకులు రైతులు సీఈఓ సాగర్ రావు సిబ్బంది పాల్గొన్నారు.
.