నాయకులు సమన్వయం తో పనిచేయాలి

తెలంగాణ ప్రభ(ధర్మపురి): ధర్మపురి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు సమన్వయం తో పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు శనివారం పట్టణంలోని శ్రీ లక్ష్మి నరసింహ గార్డెన్స్ లో పెద్దపెల్లి పార్లమెంట్ ఇంఛార్జి మోహన్ జోషి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్(మాజీ జెడ్పీ చైర్మన్) ల ఆద్వర్యంలో నియోజకవర్గ మండల అధ్యక్షులు,మరియు ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా నియోజక వర్గంలో పార్టీ గెలుపుకు తీసుకోవాల్సిన చర్యలపై నాయకులకు దిశనిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగనబట్ల దినేష్,గొల్లపెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిశాంత్ రెడ్డి,వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి, బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుభాష్,ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్,పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాములు గౌడ్, ఏల్ఎండి ఇంఛార్జి శ్రీకాంత్,బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు,రవీందర్ రెడ్డి,కుంట సుధాకర్, నియోజక వర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింహరాజు ప్రసాద్, ధర్మపురి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాందెని మొగిలి,వెల్గటూర్ యూత్ అద్యక్షుడు రమేష్,ధర్మారం యూత్ అధ్యక్షులు మహిపాల్,ధర్మపురి టౌన్ అధ్యక్షులు తిరుపతి తదితరులు పాల్గొన్నారు

.