ధర్మారంలో గణేష్ సేవ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

తెలంగాణప్రభ,(కోనరావుపేట); రాజన్న సిరిసిల్లా జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో గణేష్ సేవ యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత విగ్రహం వద్ద అమ్మవారికి భక్తులు పూజలు నిర్వహించారు.అనంతరం గణేష్ సేవ యూత్,పాక్స్ డైరెక్టర్ ఇప్ప రాములు స్వంత ఖర్చులతో  ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.అమ్మ వారిని భక్తులు భక్తి శ్రద్ధలతో నూతన వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో గణేష్ సేవ యూత్ సభ్యులు, ఆసరి రాజు,దడిగె గంగాదర్,కొమ్ము తిరుపతి,రమేష్,రాములు,మల్లారెడ్డి,గ్రామస్తులు  తదితరులు ఉన్నారు.

.