దుర్గామాత మండపంలో ప్రత్యేక పూజలు చేసిన ఫ్యాక్స్ వైస్ చైర్మన్ దంపతులు

తెలంగాణ ప్రభ, (తంగళ్ళపల్లి); తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని రెడ్డి కాలనీలో డిఎక్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గామాత మండపంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సిరిసిల్ల ఫాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, నవ్య దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు పంటలు బాగా పండి అందరూ సంతోషంగా ఉండాలని ఈ సందర్భంగా అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘ నాయకులు దోర్నాల సంజీవరెడ్డి దంపతులు, మండప నిర్వాహకులు, గ్రామ మహిళలు పాల్గొన్నారు.

.