మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మహిళలు, ప్రయాణికులు

పట్టించుకోని గ్రామపంచాయతీ పాలకవర్గం తీరుపై నిరసన చేసిన మండల యువజన సంఘాల నాయకులు.

తెలంగాణ ప్రభ (ఇల్లంతకుంట):  మండల కేంద్రంలో మరుగుదొడ్లు లేక మహిళలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో తాటి ముట్టలతో మరుగుదొడ్డి ఏర్పాటు చేసి నిరసన తెలిపిన మండల యువజన సంఘాల అధ్యక్షులు బెంద్రం తిరుపతి రెడ్డి, ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి  మాట్లాడుతూ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే అతిపెద్ద మండలమైన ఇల్లంతకుంటకు ప్రతిరోజు వివిధ గ్రామాల నుండి మహిళ  సంఘాల సోదరిమణులు,ఆర్ టీ సి మహిళా కండక్టర్లు, వందల మంది ప్రజలు, ప్రభుత్వ కార్యాలయాలకు,బ్యాంకులకు, మహిళా సంఘాల సమావేశాలకు వివిధ పనులకు వచ్చిన వారికి మరుగుదొడ్లు, మూత్రశాల లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పంచాయతీ కార్యదర్శి కి సమస్య చెప్పినా గ్రామపంచాయతీ పాలకవర్గం పైకి సమస్య నెట్టుతూ కాలయాపన చేయడంతో తాటి మట్టలతో మరుగుదొడ్డి ఏర్పాటుచేసి నిరసన  తెలుపుతున్నామన్నారు, వెంటనే మరుగుదొడ్లను ఏర్పాటుచేసి మహిళా ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో  బొల్లారం ప్రసన, యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

.