ఎలక్షన్ వస్తున్నాయని సవతి తల్లి ప్రేమ చూపించడానికి వస్తున్నారా
యువజన కాంగ్రెస్ మానకొండూరర్ నియోజకవర్గ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్
తెలంగాణ ప్రభ (ఇల్లంతకుంట): గత పది సంవత్సరాల నుంచి మా మండలాన్ని పట్టించుకోని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నారు హరీష్ రావు ఇల్లంతకుంట మండల పర్యటనకు వచ్చేముందు మీరు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. దళితుల భూములు గుంజుకొని వ్యవసాయ మార్కెట్ కట్టడమా అభివృద్ధి అంటే, డబల్ బెడ్ రూములు కట్టి ఐదు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు ఇవ్వకపోవడమా అభివృద్ధి అంటే, మీ సిద్దిపేట నియోజకవర్గం ఎలా ఉంది మా మానకొండూరు నియోజకవర్గం ఎలా ఉంది. పక్కన మీ కేటీఆర్ నియోజకవర్గం ఎలా ఉంది. మా నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలం కూతవేటు దూరంలో అటు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇటు సిద్దిపేట జిల్లా ఉన్న అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. మీ నియోజకవర్గంలో ఉన్న రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ టూరిస్టులతో కిటికీలాడుతుంటది కాలేశ్వరం కు గుండెకాయ లాంటి శ్రీ రాజరాజేశ్వర ప్రాజెక్టు అన్నపూర్ణ ప్రాజెక్టు ఎందుకు అభివృద్ధికి నోచుకోవడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుకు సహకరించిన రైతులకు భూ నిర్వాసితులకు కొంతమందికి నష్టపరిహారం ఇంకా కూడా అందలేదని వారికి నష్టపరిహారం ఇంకెప్పుడు ఇస్తారని డిమాండ్ చేశారు.ఏ మొహం పెట్టుకొని మా మండలానికి వస్తున్నారనిఅడిగారు. ఎలక్షన్ లో ప్రజలు శాసనసభ్యున్ని ఎక్కడ రోడ్లమీద తిరగనివ్వరని భయంతో ప్రతిమ కంపెనీ వారితో సీసీ రోడ్లు పోయించడం సిగ్గనిపించడం లేదా అన్నారు. 10 సంవత్సరాల దాటితే గాని మీకు ఆసుపత్రి గుర్తుకు రాలేదా అన్నారు.
