గౌడ సంఘం అధ్యక్షుడి ఏకగ్రీవ ఎన్నిక

తెలంగాణ ప్రభ (ఇల్లంతకుంట): మండలంలోని రహీంఖాన్ పేట్  గ్రామ గౌడ సంఘం అధ్యక్షుడిగా గడ్డమీది వెంకటేశం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది, పాలకవర్గం సభ్యులుగా బాలసాని శ్రీకాంత్ గౌడ్, నాగుల చంద్రయ్య గౌడ్, బత్తిని వెంకటేశం గౌడ్, గడ్డమీద వీరేశం గౌడ్, ఉత్కం చంద్రశేఖర్ గౌడ్, ఉత్కం రాజు గౌడ్, కుశాల శ్రీనివాస్ గౌడ్, కత్తి రామస్వామి గౌడ్ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గౌడ సంఘంను పాలక వర్గం తో పాటు గౌడ పెద్ద మనుషుల అండ దండలతో అభివృద్ధి కృషి చేస్తానని తెలియజేశాడు. ఈ కార్యక్రమంలో బత్తిని స్వామి, బత్తిని ప్రశాంత్, నాగుల సాయి, కొమురె విజయ్, కత్తి రామఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

.