తెలంగాణ ప్రభ (ఇల్లంతకుంట): మండల కేంద్రం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి స్థానిక శాసనసభ్యులు రసమయి బాలకిషన్ బీసీ బందుల పేరిట దళిత బందుల పేరిట మోసం చేస్తున్నారని ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని అన్నారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు బీసీ బందుల పేరిట దళిత బందుల పేరిట ఎంతమంది అర్హులైన పేదలకు ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చే పథకాలు కూడా తన టిఆర్ఎస్ కార్యకర్తలకు ఇస్తూ అర్హులైన పేదలకు అందడం లేదన్నారు. ప్రజలందరూ గమనించాలని
వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మండల ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండాలని కోరారు,ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్, జిల్లా నాయకులు పసుల వెంకన్న, పట్టణ అధ్యక్షుడు మామిడి నరేష్, ప్రధాన కార్యదర్శి కాసు పాక రమేష్, కిసాన్ సెల్ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, అల్లెపురజినీకాంత్, శ్రీనివాస్ రెడ్డి, లావా రెడ్డి, మహేందర్ రెడ్డి, కనక రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
.